రెండో వారంలో బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు?

స్టార్ మా BB5 తెలుగు రియాలిటీ షో ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులని చాలా అలరిస్తుంది. ఇక్కడ 5మచ్ ఇంటర్నెట్ లభించును అన్న హోస్ట్ నాగార్జున గారి మాటని నిజం చేసేందుకు 18 పోటీదారులందు కూడా  చాలా శ్రమిస్తున్నారు. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చిన వెనక్కు వెళ్లకుండా అందరూ గేమ్ ని తనదైన స్ట్రాటజీ తో ఆడుతున్నారు.

కానీ (E10 14 September 2021) మరియు (E11 15 September 2021) ఎపిసోడ్స్ లో హింసాత్మకంగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా బూతులు కూడా మాట్లాడేస్తున్నారు. ఈ షో ని ఫ్యామిలిస్ చేస్తుంటాయి కాబట్టి బూతులు గాని హింసాత్మకంగా వ్యవరించడం గాని దయచేసి చేయవద్దు అని నెటిజన్లు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

ఎవరు ఔట్ ఎవరు ఇన్?

ఇదిలా వుంటే బిగ్ బాస్ సీసన్ 5 2వ వారం ఎలిమినేషన్ దగ్గరపడుతోంది. ఈసారి నామినేషన్ లిస్ట్ లో శైలజ ప్రియ, ప్రియాంక సింగ్, కాజల్, లోబో, ఉమాదేవి, అనీ మాస్టర్, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. బిగ్ బాస్ ఇంట్లో గేమ్స్ మారుతున్న కొద్దీ వోటింగ్ ప్రక్రియలో పోటీదారుల స్థానాలు కూడా మారుతున్నాయి. మొదటి 2,3 రోజులు ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ సోషల్ మీడియా అనధికారిక BB5 voting polls లో చూస్తే ఆమెకే ఇప్పుడు ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఆవేశం కొంచెం ఎక్కువే అయినా ఎంటర్టైన్మెంట్ అందించడంలో తన దారే డిఫరెంట్ అంటూ ఎక్కువ మొత్తం లో నెటిజన్లు ఉమాదేవి కి ఓటు వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా లో పెద్దగా పాలోయింగ్ లేని అనీ మాస్టర్ మరియు నటరాజ్ మాస్టర్ వీరి ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ ఇంటి నుండి ఔట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మరి నిజంగానే ఈ ఇద్దరి మాస్టర్స్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారా లేదు బిగ్ బాస్ అధికారిక ఓట్ల ప్రకారం వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Comment